బచ్చలి మొక్క నేర్పిన పాఠం

ఈ రోజు అమెరికాలో సెలవు దినం.  ఆ దొరికే 8 గంటల్లో 64 పనులు చేయాలనిపిచ్చేస్తుంది !! ఈ ఎండాకాలంలో కాస్త ఖాళీ దొరికింది అనగానే, వేసిన  నాలుగు మొక్కలకి సేవ చేసుకోవడం ముందు నేను చేసే పని.  

పోయినేడాది  పెరట్లో బచ్చలి, zucchini , గోంగూర, టమాటో, వంకాయ, బెండకాయ  వేసాను. ఇంటి ముందు జినియా, కారబ్బంతి వేసాను. అయితే కొన్ని సర్పరాజాలు మా తోటలో కొంచం స్వైర విహారం చేసాయనే  చెప్పాలి. బచ్చలి, గోంగూర విపరీతంగా కాపు వచ్చాయి. వీటికి భయపడి బచ్చలి కోయకుండానే తీగలతో సహా అలాగే వదిలేసాం .   

అందుకని , ఇక ఈ ఏడాది ఏ మొక్కలు వేయకూడదు అనుకున్నాను.  కానీ ఎండాకాలంలో మొక్కలు వేయకపోతే మనసురుకోదు కదా. దానికి తోడు వేయకుండానే  కారబ్బంతి ఓ రెండు మొక్కలు వాటంతట అవే మొలకెత్తేసాయి. అవి చూసాక, ‘ కోయకపోయినా పరవాలేదు. కాస్త పెరడు పచ్చగా  ఉంటుంది’ అనుకుంటూ టమాటో, బచ్చలి, గోంగూర వేద్దాం అనుకున్నాను. టమాటో మొక్కలు చిన్నవి కొనుక్కొచ్చి నాటేస్తాను .  బచ్చలి, గోంగూర లకి మాత్రం పెద్ద కష్టపడను. కూరల కొట్లో అమ్మే కొనేసి ఆకులూ వలిచేసి ఆ కొమ్మలే భూమిలో నాటేస్తాను .  అలా, జూన్లో టమాటో పెట్టాను. గోంగూర నాటాను . ఇంక బచ్చలి నాటడం మిగిలింది.  బద్ధకిస్తూ వచ్చాను.

ఈ రోజు  పొద్దున్నే పెరట్లోకి వెళ్ళగానే  కలుపుతో పాటూ ఏవో వింతగా కొన్ని మొక్కలు కనిపించాయి. ‘ఏంటా అవి’ అని చూస్తే బచ్చలి!! కేవలం విత్తనాలు రాలిపోయి, ఆ మట్టి మేము ఎటువైపు నెట్టితే అటువైపు వచ్చేసాయి.  నీరు సరిగ్గా పోసింది లేదు. కొత్త మట్టి వేసింది లేదు. నేను కొత్తగా బచ్చలి నాటే శ్రమ లేకుండా వాటంతట అవే వచ్చేసాయి. భలే సంబరం వేసింది 

49FD70AB-889E-440A-9F52-507C8E6A5F4F

సరే దీని వలన ఈ రోజు నేను  నేర్చుకున్న పాఠం ఏంటో చెప్తాను.

మనం నాలుగు విత్తనాలు చల్లితే నాలుగు నెలలకి సరిపడా తిండి గింజలు ఇస్తోంది ఈ ప్రకృతి మాత. ‘అమ్మ’ కదా . ఎపుడూ  బిడ్డ ఆకలి తీర్చడమే ఆవిడ పని. కానీ బిడ్డలుగా మనం ఏమిస్తున్నాము ఆవిడకి? ఈ క్రింది ఫోటోలు చూడండి.

 

 మనం రోజూ చేసే పనే !! ఉండలు ఉండలుగా ఎలా దర్శనం ఇస్తుందో చూడండి.  ఇవి చూసాక కాఫీ కలుపుకునే ఒక చిన్న ప్లాస్టిక్ స్ట్రా ని చెత్తలో పడేయాలన్నా నా వల్ల కావట్లేదు. నా స్నేహితురాలు ప్రతి వారం  ఇటువంటి పోస్టులు పెడుతూ ఉంటుంది. ఓ పది లైకులు కూడా రావు. ఇటువంటివి మనకి అవసరం లేదు అని అంత ఖచ్చితంగా చెప్తున్నామో కదా!! ఓ ప్లాస్టిక్ సంచీ వాడినప్పుడల్లా తిండి పెడ్తున్న తల్లిని గుండెల మీద తంతున్నాము అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకుని వాడకం తగ్గిద్దాము _/\_ _/\_

మా పార్కు లో తామర పూలు & జలచరాలు

‘YVR  అంతరంగం’ వారి బ్లాగు చూసాక గుర్తొచ్చింది మా ఇంటి దగ్గర పార్కులో తీసిన చిత్రాలు బ్లాగులో పెట్టడం మర్చిపోయాను అని.  కొలనులో తామరపూలు విరగబూసి ఉన్నాయి. చిన్న తాబేళ్లు బోలెడు కనిపించాయి. ఇంటి పక్కనే ఉన్న ఇంతటి ప్రకృతి సంపద ని పెట్టుకుని ఎక్కడికో వెళ్తుంటాం ఏమిటా అని ఆశ్చర్యం వేసింది.   

 

IMG_9587

 

IMG_9605

IMG_9614
ఈ చిత్రాలలో  తాబేళ్ళని పట్టుకోండి చూద్దాం 🙂

 

IMG_4407

 

IMG_9615
పొద్దున్నే బోలెడు కబుర్లు చెప్పేసుకుంటున్నాయి 

IMG_4410

 

IMG_9620

సూర్యభగవానుడు

బోల్డన్ని కబుర్లు  లలిత గారు వ్రాసిన  కృష్ణ-పక్షమైన రజని టపా చదివాక నేను అన్నీ భంగిమలలో తీసిన సూర్యభగవానుడు గుర్తొచ్చి ఈ టపా 🙂

బాలాంత్రపు రజనీకాంత రావు గారి సూర్యస్తుతి వింటూ  ఈ ఫోటోలు చూస్తుంటే , అసలు అంత అందంగా ఆ పోలిక చేసి ఎలా వ్రాసారా అనిపిస్తోంది _/\_

సూర్యస్థుతి :

శ్రీ  సూర్యనారాయణా … మేలుకో … హరి సూర్యనారాయణా

పొడుస్తూ భానుడు పొన్నపూవూ ఛాయ పొన్నపూవూ మీద బొగడ పూవూ ఛాయ

ఉదయిస్తు భానుడు ఉల్లిపూవూ ఛాయ ఉల్లిపూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ

గడియెక్కి భానుడు కంబపూవూ ఛాయ కంబపూవూ మీద కాకారి పూ ఛాయ

జామెక్కి భానుడు జాజిపూవూ ఛాయ జాజిపూవూ మీద సంపెంగి పూ ఛాయ

మధ్యాహ్న భానుడు మల్లెపూవూ ఛాయ  మల్లెపూవూ మీద మంకెన్న పొడి ఛాయ

మూడుజాముల భానుడు మూలగపూవూ ఛాయ మూలగపూవూ మీద  ముత్యంపు పొడి ఛాయ

అస్తమాన భానుడు ఆవపూవూ ఛాయ ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ

వాలుతూ భానుడు వంగపండూ ఛాయ వంగపండూ మీద వజ్రంపు పొడి ఛాయ

గ్రుంకుతూ భానుడు గుమ్మడీ పూ ఛాయ గుమ్మడీ పూ మీద కుంకంపు పొడి ఛాయ

మా ఇంట శరన్నవరాత్రులు

చిన్నప్పుడు చందమామ లో ఓ కథ చదివాను. ఒకతను పొలం లో గుమ్మడి కాయలు పండిస్తాడు. పిందెలు వేసినప్పటినుంచీ ఒక్కొక్క కాయ కి ఒక్కొక్క పేరు పెట్టుకుని పిలిచుకుంటూ ఉంటాడు. ఆ కాయలు కాపుకి వస్తాయి.  ఎవరో దొంగిలించి  బజారులో అమ్ముతుంటారు. ఆ రైతు వెళ్ళి అవి తనవే అని చెప్పినా బజారులో ఎవరూ నమ్మరు. ఒక్కొక్క కాయని పేరు పెట్టి పిలుస్తూ ఏడుస్తుంటాడు . అందరూ పిచ్చివాడనుకుని నవ్వుతారు. కానీ న్యాయాధికారి అతనిని నమ్మి న్యాయం జరిగేలా చూస్తాడు.  

ప్రతి ఏడాది వసంత ఋతువు రాగానే కొన్ని విత్తనాలు వేసి, కొన్నిచిన్ని మొక్కలు స్వయంగా నా  చేతులతో పెట్టి చిన్ని తోట చూసుకుని రోజు మురిసిపోతుంటాను.

IMG_8975

IMG_8920

పూజకోసం పూలు కోయడానికి వెళ్ళగానే  ‘దయలేని వారు ఆడవారు’  అంటూ పూలు ఏడుస్తున్నట్లే అనిపిస్తుంది. పది కోసేద్దామని వెళ్లి రాలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఓ రెండుపూలు కోసుకుని వచ్చేస్తాను. ఒక్కోసారి కారు ఆపుకుని ఇంట్లోకి వెళ్తుంటే సీతాకోకచిలుకలు ఎగురుతూ  కనులవిందు చేస్తూ, నన్ను అక్కడే కూర్చోబెట్టేస్తాయి .

ఇది ‘మూణ్ణెల్ల’ ముచ్చటే  అని తెల్సినా, పైన చెప్పిన  చందమామ కథలో చెప్పిన రైతులాగాప్రతి చెట్టుతో అనుబంధం పెంచేసుకుంటాను. ఇక నవంబర్  నెలలో అన్నిటినీ  మూట కట్టి వాకిట్లో పెట్టేస్తుంటే, ఒక కఠోర జీవన సత్యం అవగతమవుతూ, ఎంత బాధేస్తుందో … మాటలలో చెప్పలేను…

ఆ అందాల వర్ణననలు నాకు వ్రాతల్లో అంత అందంగా చెప్పడం రాదు.  ఈ శరన్నవరాత్రులలో,  మా ఇంటి ముందు ఈ రూపంలో కొలువైయున్న  ఆ లలితా త్రిపుర సుందరీ  దేవిని ఇలా బ్లాగులోకానికి పంచుకుంటూ ….. దసరా శుభకాంక్షలు తెలియజేసుకుంటూ….  శరచ్చంద్రిక

IMG_3566

21729030_1566355956790462_2693370930815001919_o

IMG_2697

 

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం

బోల్డన్ని కబుర్లు వ్రాసే లలిత గారి టపా  చూసాక  శివోహం అనుకుంటూ  నా కళ్ళతో చూసే ఈ ప్రకృతి సౌందర్యాన్ని అందరి తో పంచుకోవాలనిపించింది.   కార్తీక మాసం లో పొద్దుటే ఈ పాట వింటూ నా  పనికి వెళ్తుంటాను.

14884448_1227601030665958_5793607989792244346_o

14991424_1232782426814485_2244025239957937457_o

 

14882270_1227601057332622_1391173639396297583_o

img_2892

img_2888

img_2886

img_2919

img_2915

img_2912

img_2928

అమెరికా పళ్ళ తోటలు

IMG_1884

జులై నాలుగవ తారీఖు న అమెరికా కి స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజు రాత్రి  అమెరికా లో ప్రతి ఊరి లోను  బాణాసంచా కాలుస్తారు. అవి చూడటం పిల్లలకి, పెద్దలకి ఒక వినోదం!!  ఈ మాసం కొన్ని బెర్రీ పళ్ళ సీజన్ కావడం ఇంకొక విశేషం. ప్రతి ఏడాది ఈ రోజున మా కుటుంబం fruit picking వెళ్లి రావటం ఒక ఆనవాయితీ గా పెట్టుకున్నాము. నీలం, ఎరుపు రంగు పళ్ళు తెచ్చుకుని తెల్లటి పెరుగు లో వేసుకుని జెండా రంగుల్ని అందులో చూసుకుంటాము 🙂  

Fruit picking అంటే పండ్ల తోట కి వెళ్లి మన చేత్తో మనమే పళ్ళు కోసుకుని కొని తెచ్చుకోవడం అన్నమాట.  తోట పెంచే వారు చిన్న బుట్టల్లాంటివి ఇస్తారు. ఒక బుట్ట కి ఇన్ని డాల్లర్లు అని చెప్తారు. తూకం తో పని లేదు. ఆ బుట్టలో ఎన్ని పళ్ళు  కోయగలితే అన్నీ!!  మేము ఒక గంట సేపట్లో ఎన్ని కొస్తే అన్ని అనుకుంటాము. ఈ సారి పళ్ళు సరిగ్గా లేకపోవడం వలన నాలుగు బుట్టలే  కోసాము.

షాపు లో అమ్మే పళ్ళ కంటే ఇవే ఖరీదు ఎక్కువ అనే చెప్పాలి. కాకపోతే చెట్టు నుంచి  కోసుకుని తినే  సరదా తీరుతుంది. నేను గమనించినంత వరకు  ఇందులో ఒక విషయం అర్ధం అయింది. ఇటువంటి  రైతు కేవలం పండిస్తాడు. మిగితా ఖర్చులు అంటే మార్కెట్ కి తరలించడం, రవాణా,  నిల్వ, కూలి  ఖర్చులు ప్రత్యేకం గా ఏమి చేయడు.  ఎవరికి వారే  కోసుకుంటారు కాబట్టి  ఆ కూలి మిగులుతుంది.  ఎప్పుడు పంట వచ్చిందో అప్పటికప్పుడు వెబ్సైట్ లో చెప్తాడు. అక్కడే జామ్ లు, తేనె అమ్ముతారు. కావలసిన వారు కొనుక్కుంటారు.  ఇటువంటి తోటలు హైవే కి దగ్గరగా ఉండటం ఇంకో విశేషం కూడా. ఒక్కోసారి  విద్యాలయాలు కూడా పిల్లలకి  ఇటువంటివి చూపించేందుకు field trip లు కూడా ఏర్పాటు చేస్తుంటాయి.

అమెరికాలో ఇలాంటివి  చూసినపుడు ఒక్కసారి మనసు భారత దేశం కి పరుగెడుతుంది. మన వారికి కూడా ఇలాంటి ఆలోచన ఎవరైనా చెపితే బాగుండు అని.  ఇప్పటికే అమలు పరుస్తున్నారేమో కూడా మరి నాకు తెలియదు.