బ్లాగర్లందరికీ విన్నపం

మొన్న కష్టేఫలి గారు ఏవో సామెతలు చెబుతూ టపా పెట్టినట్లున్నారు (నేను చదవలేదు). అందులో ఒక సామెత అభ్యంతరకరంగా అనిపించినట్లుంది. శ్యామలీయం గారు తొలగించమన్నారు. కష్టేఫలి గారు తొలగించారు. ఆ గొడవేదో అంతవరకూ అయిపోయింది. ఆ విషయాన్నీ అంతటితో వదిలేస్తే బావుంటుంది. దాన్ని పెద్ద రాద్ధాంత విషయం గా చిత్రీకరిస్తూ ‘రమ్యంగా కుటీరాన ….. ’ బ్లాగరు నీహారిక గారు నిన్న’శ్యామలీయం గారికి నీహారిక వ్రాయునది… ‘ అంటూ ఒక టపా పెట్టారు. అక్కడ నీహారిక గారివి కొన్ని వ్యాఖ్యలు చూసాను.

శ్యామలీయం గారు,
దీనిగురించి మీరు మీ సమయాన్ని వృధా చేయనవసరం లేదు.క్షమించమని చెప్పేస్తే శిక్ష ఉండదా ? తెలిసే చేసేనని మరీ చెపుతున్నారు, తెలిసి చేస్తే శిక్షలుండవా ? జగన్, చంద్రబాబు, అద్వానీ కూడా (తెలిసే)చేసాను క్షమించమంటే క్షమించి వదిలి పెట్టేస్తారా ? చేసిన పాపం చెపితే పోతుందా ? శిక్షలు అక్ఖర్లేదా ?

“క్షమించమని వేడుకున్నారు గాబట్టి శిక్ష తగ్గిస్తాను. ఒక నెలరోజులపాటు ఆయన బ్లాగింగ్ మానుకోవాలి.ఫాతపోస్టుల్లో కూడా ఎవరూ వ్యాఖ్యానించడానికి వీలు కల్పించకూడదు. ఒక నెల రోజులపాటు బ్లాగింగ్ మానుకోపోయినా ఆయన బ్లాగుల్లో కామెంట్స్ ఎవరు చేసినా వారిని నేను తీవ్రంగా శిక్షార్హులుగా భావిస్తాను. ఒక మంచి వాతావరణం సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి నా మద్దతు ప్రకటిస్తున్నాను. తరువాత మీఇష్టం !

ఈ శిక్ష తగ్గించడం ఏమిటి? ఆయన నెలరోజులు బ్లాగులు వ్రాయకూడదని చెప్పడం ఏమిటి? ఈవిడ ఎవరు చెప్పడానికి ? ‘ఒక నెల రోజులపాటు బ్లాగింగ్ మానుకోపోయినా ఆయన బ్లాగుల్లో కామెంట్స్ ఎవరు చేసినా వారిని నేను తీవ్రంగా శిక్షార్హులుగా భావిస్తాను.’ ఇది ప్రజాస్వామ్యమా లేక పెత్తనమా ?

నీహారిక గారు శర్మ గారిని ‘ఖర్మ’ గారు అంటూ, గోదావరి జిల్లాల్లో బ్రాహ్మణులు ‘కొబ్బరిచిప్పల బ్యాచి’ అంటూ ఎద్దేవా చేస్తారు . ఇలా ఒక సారి కాదు ఎన్నో సార్లు జరిగింది. చాలా సార్లు ఈవిడ వ్యాఖ్యలతో, టపాలలో చెప్పాల్సింది చెప్పలేకపోవడం, టపాలు ఎత్తివేయడం కూడా జరిగింది నా మటుకు నాకు. ఎవరైనా సరే విమర్శ, వ్యాఖ్య చేయవచ్చు. లేదా ఆ టపా నచ్చకపోతే వారి అభిప్రాయాలూ వారి బ్లాగులో చెప్పుకోవచ్చు. తప్పు లేదు. బ్లాగుల్లో ప్రతీ టపాని హేళన చేస్తూ ఉంటే ఉన్న నాలుగు బ్లాగులు కూడా ఉండవు కదా !!

ఏ ఒక్క బ్లాగరు, శర్మ గారిని దూషిస్తున్నా , ఒక కులాన్ని ‘కొబ్బరిచిప్పల బ్యాచి’ అంటూ ఉన్నా ఖండించకపోవడం చాలా శోచనీయం(ఈ కులం వాళ్ళు ఏమి అనరు అని నీహారిక గారికి బాగా తెల్సు). వారు పోస్టు చేసిన సామెత కంటే, ఈ వ్యక్తిగత దూషణ ( ఈ సామెత టపా రాకముందు కూడా ఈవిడ చాలా సార్లు అన్నారు ఈ మాటలు) చాలా ఖండించాల్సిన విషయము!!

ఈ రోజు శర్మ గారికి warning లు వచ్చాయి. రేపు ఇంకో బ్లాగరుకి వస్తాయి. మనకెందుకులే మన బ్లాగు మనకి ఉంటే చాలు అనుకుంటే నేనేం చెప్పలేను !! ‘ఈ సామెత ఎందుకొచ్చిదండీ’, ‘ఆ కూర ఎలా ఉంటుందండీ’ అని మనం కాలక్షేపం కోసం అడిగే ప్రశ్నలకి కబుర్లు చెప్పే శర్మ గార్లు మనకి దొరకరు !! ఆలోచించండి!!

3 thoughts on “బ్లాగర్లందరికీ విన్నపం”

  1. చాలా బాగా చెప్పారు

    ఇట్లాంటి సో కాల్డ్ శిక్ష వేస్తామనడానికి వాళ్ళెవరు.
    మధ్యలో కామెంటితే శిక్షేస్తారట.

    ఇలాంటి వాటికి బెదిరే ప్రసక్తే లేదు.

    జిలేబి

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. శ్రీశర్మ గారు ఒక చోట భర్తృహరి సుభాషితం “మూర్ఖుల మనస్సు రంజింప చేయటం” గురించి ఉదహరించారు. మనం అందరికి చెప్పి మనస్సు మార్చలేము, ఖండించటం తప్ప. ఈ తల్లి ఆవిడ మాటల ద్వారా ఎందరి చేత తిట్లు తిందో బ్లాగ్లోకంలో తెలియని వాళ్ళు లేరు అందుకని ఆవిడని పట్టించుకోకపోవటమే సరైన శిక్ష.

    మెచ్చుకోండి

    1. నిజమే !! టీవీ ఛానళ్లు TRP కోసం ఏదో ఒకటి ఎంచుకున్నట్లే బ్లాగులోకంలో ఆవిడ బ్లాగు hits కోసం ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేసుకుంటోంది. ఏం చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఈ టపా వ్రాసింది ఆవిడ కోసం మాత్రం కాదండీ

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి