మా ఇంట శరన్నవరాత్రులు

చిన్నప్పుడు చందమామ లో ఓ కథ చదివాను. ఒకతను పొలం లో గుమ్మడి కాయలు పండిస్తాడు. పిందెలు వేసినప్పటినుంచీ ఒక్కొక్క కాయ కి ఒక్కొక్క పేరు పెట్టుకుని పిలిచుకుంటూ ఉంటాడు. ఆ కాయలు కాపుకి వస్తాయి.  ఎవరో దొంగిలించి  బజారులో అమ్ముతుంటారు. ఆ రైతు వెళ్ళి అవి తనవే అని చెప్పినా బజారులో ఎవరూ నమ్మరు. ఒక్కొక్క కాయని పేరు పెట్టి పిలుస్తూ ఏడుస్తుంటాడు . అందరూ పిచ్చివాడనుకుని నవ్వుతారు. కానీ న్యాయాధికారి అతనిని నమ్మి న్యాయం జరిగేలా చూస్తాడు.  

ప్రతి ఏడాది వసంత ఋతువు రాగానే కొన్ని విత్తనాలు వేసి, కొన్నిచిన్ని మొక్కలు స్వయంగా నా  చేతులతో పెట్టి చిన్ని తోట చూసుకుని రోజు మురిసిపోతుంటాను.

IMG_8975

IMG_8920

పూజకోసం పూలు కోయడానికి వెళ్ళగానే  ‘దయలేని వారు ఆడవారు’  అంటూ పూలు ఏడుస్తున్నట్లే అనిపిస్తుంది. పది కోసేద్దామని వెళ్లి రాలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఓ రెండుపూలు కోసుకుని వచ్చేస్తాను. ఒక్కోసారి కారు ఆపుకుని ఇంట్లోకి వెళ్తుంటే సీతాకోకచిలుకలు ఎగురుతూ  కనులవిందు చేస్తూ, నన్ను అక్కడే కూర్చోబెట్టేస్తాయి .

ఇది ‘మూణ్ణెల్ల’ ముచ్చటే  అని తెల్సినా, పైన చెప్పిన  చందమామ కథలో చెప్పిన రైతులాగాప్రతి చెట్టుతో అనుబంధం పెంచేసుకుంటాను. ఇక నవంబర్  నెలలో అన్నిటినీ  మూట కట్టి వాకిట్లో పెట్టేస్తుంటే, ఒక కఠోర జీవన సత్యం అవగతమవుతూ, ఎంత బాధేస్తుందో … మాటలలో చెప్పలేను…

ఆ అందాల వర్ణననలు నాకు వ్రాతల్లో అంత అందంగా చెప్పడం రాదు.  ఈ శరన్నవరాత్రులలో,  మా ఇంటి ముందు ఈ రూపంలో కొలువైయున్న  ఆ లలితా త్రిపుర సుందరీ  దేవిని ఇలా బ్లాగులోకానికి పంచుకుంటూ ….. దసరా శుభకాంక్షలు తెలియజేసుకుంటూ….  శరచ్చంద్రిక

IMG_3566

21729030_1566355956790462_2693370930815001919_o

IMG_2697

 

6 thoughts on “మా ఇంట శరన్నవరాత్రులు”

  1. మొక్కల్లో అమ్మవారిని చూపిన మీకు నమస్కారమ్. ప్రకృతిలో కాలంతో వచ్చే మార్పులు సహజం. మళ్ళీ వచ్చే వసంతం గురించి ఆశగా ఎదురుచూడటమే. మీ మొక్కలు చాలా ఆరోగ్యంగా, అందంగా ఉన్నాయి.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి