ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!

నిన్నటికి మొన్న,  144 మంది ప్రయాణీస్తున్న విమానం. ఆకాశంలోకి  ఎగరగానే ఒక్క సారిగా engine failure. ఎంతో నైపుణ్యంతో ఏ మాత్రం తొణకకుండా  ఆ పైలట్ 143 మందిని యమలోకం నుండి భూలోకానికి చేర్చింది. కిటికీ అద్దం విరిగి, తోటి ప్రయాణీకురాలు  శరీరం సగం విమానం బయటికి వెళ్ళిపోతే, ఆవిడ ప్రాణాలు కాపాడాలని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లోపలి లాగారు cowboy  టోపీ పెట్టుకున్న ఒక హీరో. ఇంకో ఇద్దరు ఆవిడకి ఊపిరిపోసి ప్రాణం కాపాడదాం అనుకున్నారు. ‘అంత నైపుణ్యంగల పైలట్ ఉన్న విమానంలో  ఉండటం వలన బ్రతికాం, లేకపోతే మా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిన రోజు కదా ‘ అనుకుంటున్నారు 143 మంది. ఊపిరిపోసినా ప్రాణాలు నిలువలేదు 144-143 =1 ఒకరికి.  ఎలా జరిగింది అంటే చెప్పగలమేమో కానీ ఎందుకు జరిగింది అన్న ప్రశ్న కి సమాధానం ఎవరు చెబుతారు?

జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే’ నిజం కాదా ? కాదనే వారున్నారు 🙂

అటువంటి వారి కోసమే ఎప్పుడో ఉగాది తర్వాత  వ్రాసుకున్న ఒక టపా ఇప్పుడు పోస్టు చేస్తున్నాను:

‘ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!’అంటూ  ఈ మధ్య  హేతువాదుల  గోల ఎక్కువయింది. పుస్తకాలు, ఫేస్బుక్  గోడలు, జాతకాల గురించి, పూజల గురించి ఎడ తెరపి లేకుండా అన్నీ సైన్స్ తోటే సాధ్యం అంటూ టీవిలో వాదనలు!! పండగల రోజుల్లో కూడా పొద్దున్నే టీవీల్లో ప్రత్యక్షమవుతున్నారట !! ఈ మధ్య జనాలకి  డబ్బులు ఎక్కువయ్యి పూజలు, మూఢభక్తి హెచ్చి వేలంవెర్రి ఎక్కువయ్యింది అని ఒప్పుకుంటాను. మూఢ నమ్మకాల గురించి తెలియజెప్పడం మంచిదే అంటాను. కానీ మూఢనమ్మకాలు తీసివేయడం దేవుడెరుగు 🙂 వెర్రిమొర్రి  వితండవాదన చేసి జనాల్లో ఉన్న కాస్త పాపభీతి అనేది కూడా లేకుండా చేస్తూ, సర్వమంగళం పాడిస్తున్నారు ఈ హేతువాదులు. కొండ నాలుకకు మందువేస్తే, ఉన్న నాలుక ఊడిందట!! వాళ్ళు చెప్పిందే అందరూ నమ్మి హేతువాదుల్లాగా మారిపోవాలనుకుంతున్నారో ఏంటో మరి!!  మొత్తానికి మతమార్పిడి చేసే గురువుల కంటే చాలా విసిగిస్తున్నారు అనిపిస్తోంది. ఎవరి నమ్మకాలు వారివి. ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించినంతకాలం ఎవరు ఏ సంప్రదాయాన్ని నమ్మినా తప్పులేదు. కానీ ఇంకొకరి నమ్మకాన్ని హేళన చేయటం, ‘నాన్సెన్స్’ అనే మాట  అనటమూ చూసాక ఓ టపా వ్రాయాలి అనిపించింది.

‘దేవుడనే వాడే లేడు. ఎవ్వరూ  చూడలేదు. ఉంటే చూపించండీ ‘ 

‘పూర్వజన్మలు , పాపాలు , పుణ్యాలు, మోక్షము  ఇవన్నీ చెత్త మాటలు. మనిషిని ఆకర్షించడానికి ఇవన్నీ చెప్పి పిచ్చి వాళ్ళని చేస్తారు’

ఈ రోజుల్లో టీవీలు, అంతర్జాలం, ముఖపుస్తకం , వాట్సాప్ వచ్చేసి అందరం  అన్నీ బోధిస్తూ మాట్లాడేస్తున్నాం కానీ, పూర్వం ఇవేమి ఉండేవి కాదు కదా !! మరి ఒక సామాన్యుడికి మంచేదో చెడేదో బోధిస్తూ వాడికి ఎటువంటి విపత్తు వచ్చినా  దాన్ని ఎదుర్కొని మనోధైర్యాన్ని ఇచ్చి, తిరిగి సమాజంలో జీవించేలా చేయడానికి ఏమిటి మార్గం ? ఈ రోజుల్లోలాగా వాడికి కౌన్సిలింగ్ అంటూ గంటకి $150 అంటే వారి పరిస్థితి ఏమయిపోవాలి?  

వేరే మతాల గురించి నాకు తెలీదు. వాటి గురించి మాట్లాడను. నాకు తెలిసినదే మాట్లాడతాను.  

సనాతనధర్మం /వేదాంతం/తత్వబోధ/ హిందూమతం  తీసుకుంటే, సమాజం లో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పరిస్థితిని ఆలోచించి ఎన్ని తత్వబోధలు చేసారో వింటుంటే ఆశ్చర్యం అన్పిస్తుంది. ఒక కౌన్సిలర్ కూడా అన్ని విషయాలు చెబుతాడా అనేది సందేహమే !! ఈ concept  చూస్తే → ఈ శరీరం శాశ్వతం కాదు. చేసిన పాపపుణ్యాల బట్టి మోక్షప్రాప్తి లేకపోతే ఇంకో జన్మ. హేతువాదులు చెప్పినట్లు ఇది అబద్ధమే ట్రాష్ అనుకున్నా, తెలుసుకోవలసిన ఒక్క నిజం ఖచ్చితంగా చెప్తుంది శాస్త్రం.  ఒక మనిషికి ఆయుష్షు నూరేళ్ళు.అంటే ఆ నూరేళ్నూ బ్రతకడు కదా? ఓ ఎనభై ఏళ్ళు. ఆ ఎనభై తర్వాత తాను సున్నా అనుకోడు. కానీ తానెప్పుడూ భూమి మీద ఉండేవాడినే అనుకుంటూ ఉంటాడు. అందుకే నువ్వెప్పుడూ temporary వాడివేరా అని గుర్తుచేస్తుంటుంది  వేదాంతం. ఇవి వినీ వినీ ఒక మనిషికి తన శరీరం శాశ్వతం కాదు అనే వైరాగ్యం వస్తే చాలు, మంచి పనులు తప్ప చెడు పనులు చేయడానికి మనసు ఊరుకోదు. అలా కొంత కాకపోతే కొంతైనా introspection మొదలవుతుంది. ఫలానా పాపం చేస్తే వచ్చే జన్మ లో పిల్లిలానో/ బల్లిలానో  పుడతావు అంటే ఒక సామాన్యుడు నమ్మి ఉండవచ్చు. ఆ భయం ఉండేది కాబట్టి ఎప్పుడూ నిజాయితీ/ సద్బుద్ధి/నీతి/నియమాల తో ఉండేవాడు. పాపాలు అంటే ఉదాహరణలు చూస్తే : తల్లితండ్రుల మాట వినకపోతే పాపం, పెద్దలని గౌరవించకపోతే పాపం, హత్య చేస్తే పాపం, ఆత్మహత్య మహాపాపం, మాటలతో హింసిస్తే పాపం, చీమని చంపినా పాపం, చివరికి అసురసంధ్య వేళ  చెట్టుని ముట్టుకున్నా పాపం. బ్రతికి ఉన్నన్నాళ్ళూ మంచి పనులే చేయి అని చెప్పడం ఈ ముఖ్య ఉద్దేశ్యం. అలా కొద్దో గొప్పో పాపభీతి ఉన్నమనిషికి రొజూ టీవిలో యాంకర్ పక్కన కూర్చుని ‘ పాపం లేదు పుణ్యం లేదు. అంతా నాన్సెన్స్ ‘ చెబుతుంటే అంటే ఏమవుతుంది?

ఇక  ‘పూర్వజన్మ సుకృతం’ – ఈ మాట అంటే హేతువాదులకి ఎంత కోపమో  🙂

జబ్బు వలనో, ప్రమాదం వలనో , ఇంక దేని వలన కానీ  మృత్యువు సంభవించి కుటుంబసభ్యులని కోల్పోయిన వారికి ఏ కౌన్సిలింగ్ ఇస్తే వారి బాధ మాయమవుతుంది?  వారిని రోజు వేధించే ప్రశ్న ఒకటి ఉంటుంది. ‘నాకే ఎందుకు ఈ బాధ ?’ ‘why only me ?’. ఈ మధ్యఎవరైనా చనిపోతే  తరచుగా చూసే వ్యాఖ్య – ‘RIP. I Pray God to give enough strength to their family members’. నిజమే. అందరూ ప్రార్థిస్తారు  వారి కోసం. కానీ ‘దేవుడు’ అనే నమ్మకం కూడా కోల్పోయిన పరిస్థితి లో ఉంటారు వారి కుటుంబ సభ్యులు. అప్పుడు ఏమి చెప్పగలము? అటువంటి విపత్కర పరిస్థితులు  ఎదురైన వారికి, ‘అందరికీ అన్నీ ఉన్నాయి. నేను మాత్రమే చాలా కోల్పోయాను’ అన్న భావన తో విరక్తి కలిగి, సమాజం అంటే ఒక రకమైన ఏవగింపు, తెలియని కసి మొదలవుతుంది. ఆ ప్రభావం ఎప్పుడో ఎక్కడో  చూపించడం మొదలవుతుంది. అది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అటువంటి పరిస్థితులకే ‘ఏదో జన్మ లో పాపం. ఈ జన్మ లో వారి నుదుటి వ్రాత ’ అన్న కర్మసిద్ధాంతము & జన్మజన్మల వృత్తాంతాల కథలు, గాధలు  వచ్చాయి అనిపిస్తుంది. ఆ మాట నిజంగా పాపం చేసారనా ?? ఎంత మాత్రం కాదు. కేవలం అంత బాధ లో ఉన్న మనిషి డిప్రెషన్ లో కొనసాగకుండా, ’పోయిన జన్మలో ఏదో పాపం వలన ఇలా అయింది. పోనీ ఈ జన్మ లో అయినా దాన్ని రూపుమాపేలా చేసుకుందాం’ అనే నిర్ధారణ కి వచ్చి తిరిగి సర్దుకుని సమాజజీవనంలోకి ప్రవేశించేందుకు ఈ అస్త్రం!!  ఏ సిద్ధాంతాలయినా బ్రతికి ఉన్న మనిషికే కానీ చనిపోయిన వారికి కాదు అన్న సంగతి అందరికీ తెలుసు ఒక్క ఈ హేతువాదులకి తప్ప 🙂

దేవుడి పూజ చేస్తే పాపాలు పోతాయా ? రావణాసురుడు వేదం చదువుకున్నాడు. ప్రొద్దున్నే లేచి పూజలు కూడా ‘ శాస్త్రోక్తముగా  వేకువనే విధులన్నీ యొనర్చెను’ అని చెప్పారు. పూజ చేసాడుగా రావణాసురుడు? మరి పాపాలన్నీ హరించుకుపోవాలి కదా ?  పూజ చేసుకుంటున్నంత సేపు  ‘మదోత్కటుడై మదనతాపమున మరిమరి సీతను మదిలో నెంచెను’ అని కూడా చెప్పారు. !!

ఏది పుణ్యం? ఏది పాపం ?  మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకోవడమే పాపపుణ్యాలు  !! just an introspective!! చిత్తశుద్ధి తో చేసే పని తో స్వర్గం కనిపిస్తుంది !! చిత్తశుద్ధి లేకపోతే అనుక్షణం నరకమే కనిపిస్తుంది  !!

‘దేవుడు ఉంటే  కనిపిస్తాడు గా. లేనే లేడు . physical గా కనిపించనిదే  ఎలా నమ్ముతాం?’ . తన జీవితంలో రోజులు గడిచిపోతుంటే కాళికాదేవి కనిపించట్లేదని రామకృష్ణ పరమహంస  పొర్లి పొర్లి ఏడ్చారట. దేవుడు అంత సులభంగా కనిపిస్తాడా అందరికీ ? ఏమో చెప్పలేము హేతువాదులకి కనిపించినా కనిపించచ్చు కూడా . ప్రహ్లాదుడు పుట్టినప్పటినుండీ ఆయననే తలచుకున్నా, ఆయనకి  కనిపించని వాడు హిరణ్యకశిపుడు అడగగానే ఒక్క ‘దెబ్బ’ కి కనిపించాడుగా !!

హేతువాదులూ , మీరు పూజలు చేయనక్కర్లలేదు. దేవుడిని నమ్మనక్కర్లలేదు.  దేవుడు లేడని నమ్మించనక్కర్లేదు. చెట్టు కొమ్మకి చీడ పట్టిందని చెట్టుని వేర్లతో మాత్రం  పీకేయకండి బాబు!!

Science gives knowledge, but not wisdom!!!

9 thoughts on “ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!”

 1. ‘దేవుడు ఉంటే కనిపిస్తాడు గా. లేనే లేడు . physical గా కనిపించనిదే ఎలా నమ్ముతాం?’ .

  అనే వాళ్ళు ఉన్నారు కానీ వారికి కూడా; గాలి కనపడదు , xrays కనపడవు, micro waves కనపడవు, కానీ అవి ఉన్నాయని నమ్మే వారికి మాత్రం అవి కనబడతాయి. అల్లాగే దేవుడు కూడా. అందరికీ అన్నీ కనపడవు. ఇంకా మనకి కనపడనివి ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయో.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. గాలిని sense చెయ్యొచ్చు. X-raysనీ, microwavesనీ detect చెయ్యొచ్చు. ప్రయోగాత్మకంగా నిరూపించొచ్చు. అన్నింటిమటే ముఖ్యంగా అవి dependableగానూ, universalగానూ, repeatableగానూ పనిచేస్తాయి.

   దైవం అనేది ఒక philosophical entity. అదికూడా అతుకులబొంతలాంటి ఫిలాసఫీ. దేవుని తత్వం గురించించి consistentగా వివరించిన పుస్తకం ఒక్కటి ఉదాహరిస్తే చదువుకు తరిస్తాను.

   సరే! అవన్నీ వదిలెయ్యండి… మీకు ఒక కస్టమొస్తే… దేవువుడున్నాళ్ళే అని వదిలేస్తారా లేక పోలీసులనో, లాయర్లనో ఆశ్రయిస్తారా? ఏం? ద్రౌపదిలాగా శరణాగతి ఎందుకు చెయ్యరు? అక్కడే అర్ధమౌతుంది దేవుడు అనేది dependable concept కాదు అని. మరింకెందుకు ఈ అనవసరమైన కబుర్లు?

   మెచ్చుకోండి

   1. విశేషజ్ఞాన గారూ
    xrays microwaves కనిపెట్టక ముందు అవి ఉంటాయని ఎవరికీ తెలియదు. అంతెందుకు భూమి గుండ్రంగా ఉంటుందంటేనే ఎంతమందో అవహేళన చేశారు. ఇంకేవో బోసాన్లు అవీ ఉంటా యంటున్నారు. మీరు చూశారా నేను చూశానా. నమ్ము తున్నాము అంతే. నా సెన్సుయల్ పరిజ్ఞానం లోకి రాలేదు కాబట్టి అవి లేవు అనటం సరికాదు. ప్రపంచం లో అందరి పరిజ్ఞానం ఒకటి కాదు.

    కష్టాలొస్తే పోలీసులు లేక లాయర్ల దగ్గిరకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. లేకపోతే కోట్ల మీద కేసులుండాలి. ఎందుకంటే కష్టాలు రాని (లేని) వాళ్ళు నా డెబ్భై ఏళ్ళ జీవితంలో ఎవ్వరూ కనపడలేదు.

    మెచ్చుకోండి

   2. viseshajna గారు,

    నిజమే. అన్నీ ప్రయోగాత్మకంగా చూపించచ్చు. ఈ సైన్స్ అంతా కాన్సర్ వచ్చినవారికి
    చెప్పి ధైర్యం గా ఉండమని చెప్పగలరా ?

    ‘దేవుని తత్వం గురించించి consistentగా వివరించిన పుస్తకం ఒక్కటి ఉదాహరిస్తే చదువుకు తరిస్తాను’ – ఒక్క చిన్న మాత్రలో మందు పెట్టాలంటే దాని మీద కొన్ని ఏళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తారు అని విన్నాను. మరి అలాగే మీరు అడిగిన విషయం మీద కూడా మీలాంటి వారికి అలాంటి పుస్తకం త్వరలో వస్తుందనే ఆశిద్దాం.

    ‘ అక్కడే అర్ధమౌతుంది దేవుడు అనేది dependable concept కాదు అని’. దేవుడు ఒక magician అనుకుంటే అంతే కదా మరి !!

    మెచ్చుకోండి

 2. చాలా బాగుంది నీ లిఖిత . కర్మ సిద్ధాంతం అంత సులువుగా మనిషికి బుర్రలో ఎక్కదు.
  భారతం లో అర్జునుడికి కూడా సందేహం వచ్చినపుడు.. ఇక టీవీ లో కనిపించే మూర్కులకి సైన్స్ చర్చలు చేసే వారికి ఎలా సాధ్యం …

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: